యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న 3వ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. రెండు సాంగ్స్ తోపాటు రెండు యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చూస్తే చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నిధి అగార్వల్ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక తన రెండు చిత్రాలతో అభిమానులను నిరాశపరిచిన అఖిల్ ఈచిత్రం తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలగా వున్నాడు.


