మెగాస్టార్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా !

Cheranjevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా రాబోతుంది. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఐతే, నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఎంటర్ టైన్ మెంట్ బాగా వర్క్ అవుట్ అయినప్పటికీ, మెయిన్ గా చిరంజీవి లుక్ బాగా హైలైట్ అయింది. ట్రైలర్ అంతటా మెగాస్టార్ స్టైలిష్ గా, ఎనర్జిటిక్ గా మరియు ఫ్రెష్ గా కనిపిస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తునారు.

ఇక ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మరి ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా రాబోతుంది కూడా ఈ సినిమానే.

Exit mobile version