ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అంతరిక్షం’ !

ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘అంతరిక్షం’ !

Published on Dec 6, 2018 12:46 AM IST

antahriskham

‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. క్రిష్‌ జాగర్లమూడి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయకిగా నటిస్తుండగా అదితిరావ్ హైదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వరుణ్ ఈ చిత్రంతో పాటు అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ తో కలిసి మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు