ముద్ర’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

Published on May 30, 2018 8:35 pm IST

నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న చిత్రం ముద్ర . తమిళ్ లో మంచి విజయం సాధించిన ‘కానితన్’ సినిమాకి రీమేక్ గా వస్తుంది ఈ చిత్రం .ఒరిజినల్ వెర్షన్ ని కూడా సంతోషే డైరెక్ట్ చేసాడు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని జూన్ 1న రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్ . ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. కిరాక్ పార్టీ సినిమా తరువాత నిఖిల్ నటిస్తున్న ఈ సినిమా ఫై మంచి అంచనాలు ఉన్నాయి. కిరాక్ పార్టీ సినిమా కూడా రీమేక్ కావడం విశేషం. కన్నడలో ఘన విజయం సాధించిన కిరిక్ పార్టీ సినిమాని కిరాక్ పార్టీ గా రీమేక్ చేసారు.

సంబంధిత సమాచారం :