మహేశ్ బాబు కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

మహేశ్ బాబు కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్ !

Published on May 28, 2019 9:20 PM IST

మహేశ్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్నాడని, మే 31వ తేదీన ఈ సినిమా అధికారికంగా లాంచ్ కానుందని తెలిసిందే. కాగా ఈ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. మే 31వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం 9.18 amకి అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు మహేశ్ బాబుతో పాటు మొత్తం చిత్రబృందం కూడా పాల్గొనబోతుంది.

మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలే ఉంటాయి ఇక ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఆలాగే రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు