మొదలైన రజినీకాంత్ ‘లింగా’

మొదలైన రజినీకాంత్ ‘లింగా’

Published on May 2, 2014 6:15 PM IST

rajini-kanth
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న ‘లింగా’ సినిమా ఈ రోజు నుంచి సెట్స్ పైకి వెళ్ళింది. ఈ రోజు మైసూర్ లోని సుమందీశ్వరి గుడిలో లాంచనంగా ప్రారంభమైంది. కన్నడ స్టార్ అంబరీష్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సుమలత కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రజినీ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమా కోసం మైసూర్ లో ఓ సెట్ నిర్మిస్తున్నారు. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ప్రస్తుతం తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు