సరికొత్త శైలిలో ‘ముకుంద’ పాటలు

సరికొత్త శైలిలో ‘ముకుంద’ పాటలు

Published on Dec 4, 2014 8:43 AM IST

Mukunda-Audio-Launch

టాలీవుడ్ అంతటా ప్రస్తుతం ఆసక్తిగొలుపుతున్న వరుణ్ తేజ్ పరిచయ చిత్రం ‘ముకుంద’ ఆడియో బుధవారం శిల్పకళా వేదికలో ఆవిష్కృతమైంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విద్యార్థి రాజకీయ నేపథ్యంతో సాగనున్నట్టు సమాచారం. మిక్కీ జే మేయర్ తనదైన మెలోడీతో ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం జరిగింది. పాటల్లోని వరుణ్ భావోద్వేగాలకు మెగా అభిమానులు ముగ్దులైపోయారు.

ఈ సందర్భంగా విడుదలైన ముకుంద సినిమా టీజర్ కి మెగా అభిమానులనుండే కాక సోషల్ మీడియా నుండి కూదా అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమాకి సాహిత్యాన్ని ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అందించారు. పూజా హెగ్డే వరుణ్ తేజ్ తో జతకట్టిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు