మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న మరో హీరో, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుంద’. ఈ చిత్ర టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని ఇది వరకే తెలియజేశాం. ప్రస్తుతం ఈ సినిమాలో మిగిలిన ఉన్న రెండు పాటలని ప్రస్తుతం స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ – పూజ హెగ్డే అక్కడి అందమైన లోకేషన్స్ లో ఈ పాటలకి స్టెప్స్ వేస్తున్నారు.
ఇటీవలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. యూరప్ షెడ్యూల్ వెళ్ళడానికి ముందే వరుణ్ తేజ్ ‘ముకుంద’ లో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీలోవరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.


