సంక్రాంతికి రానున్న మల్టీస్టారర్ !
Published on Jun 24, 2018 10:10 am IST

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్‌, మెగా హీరో వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌ 2’ అనే చిత్రంలో కలిసి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ లకు జోడీలుగా తమన్నా, మెహరీన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో శనివారం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కాగా అల్లు అరవింద్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, నిర్మాత దిల్‌రాజు స్క్రిప్టుని దర్శకుడు అనిల్ రావిపూడికి అందజేశారు.ఈ చిత్రంలో వెంకటేష్ కి వరుణ్ తేజ్ తోడల్లుడుగా నటించనున్నాడు.

పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం జూలై 5 నుంచి జులై 20 వరకు చిత్రీకరిణ జరగనుంది. దిల్ రాజి మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, యంగ్ మ్యూజిక్ సంచలనం దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook