తన ఐటెం సాంగ్ లతో యావత్ యువతనే ఒక ఊపు ఊపేసిన తార ముమైత్ ఖాన్. అయితే ఉన్నట్టుండి ఈ భామ చుట్టూ అలుముకున్న క్రేజ్ ఒక్కసారిగా తొలగిపోయింది. తరచూ ఐటెం సాంగ్ లలో కనిపించే ముమైత్ ఇప్పుడు అసలంటూ కనిపించకుండా పోయింది. ఇప్పుడు వస్తన్న ఒక వీడియో ముమైత్ నుంచి ప్రేక్షకులు ఏమి ఆశిస్తున్నారో అది ఇవ్వనుందట.
ఐటెం సాంగ్ లకు పెట్టింది పేరుగా నిలిచినా ఈ భామ దాదాపు అందరు అగ్రనటులతో ఆడిపాడింది. పూరి జగన్నాధ్ సినిమాలో ఒకప్పుడు ముమైత్ పాట లేకుండా సినిమా పూర్తయ్యేదికాదు. కాకపోతే అదంతా గతంగా మిగిలిపోయింది
ఇప్పుడు ఈ ‘ఎడిక్షన్’ పేరుతొ వస్తున్న వీడియో సాంగ్ లో ముమైత్ రెచ్చిపోయినట్టు సమాచారం. ఈ వీడియోని సైకోటిక్ బ్రదర్స్ తెరకెక్కించారు


