జనవరి 20వ తేదిన ముంబైలో ప్రముఖ సంగీత దర్శకుడు, స్వరజ్ఞాని ఇళయరాజాకు ఆత్మీయ సత్కారం జరగనుంది. ఈ సత్కారాన్ని హిందీ చిత్ర దర్శకుడు ఆర్ బల్కీ ఏర్పాటు చేశారు. ఈ సత్కార కార్యక్రమానికి అగ్ర నటీనటులతో పాటు, దిగ్గజ సంగీత కళాకారులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో గతంలో ఇళయరాజాతో పని చేసిన లతా మంగేష్కర్, పి.సుశీల, ఎస్.జానకిలు సుమధుర గీతాలను ఆలపించనున్నారు.
ఇళయరాజా అంటే బల్కీకి అమితమైన అభిమానం. బల్కీ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘షమితాబ్’కు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ ఒక్క సినిమానే కాదు, గతంలో బల్కీ తెరకెక్కించిన అన్ని సినిమాలకు ఇళయరాజానే సంగీత దర్శకుడు. తన సంగీతంతో ఆయా సినిమాలకు ఇళయరాజా ప్రాణం పోశారు.


