20 నిముషాల్లోనే మహేష్ ను మెప్పించిన మురుగదాస్ !
Published on Aug 22, 2017 5:48 pm IST


మహేష్ చేస్తున్న ‘స్పైడర్’ సినిమాకు ఇంతలా క్రేజ్ దక్కడానికి చిత్ర దర్శకుడు మురుగదాస్ కూడా ఒక ప్రధాన కారణం. సినిమా ద్వారా కమర్షియల్ అంశాలతో పాటే సోషల్ మెసేజ్ ను కూడా అందించే మురుగదాస్ మహేష్ తో చేతులు కలపడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఓ చిన్నపాటి కథ ఉంది.

అదేమిటంటే ‘స్టాలిన్’ సినిమా సమయంలో మురుగదాస్ ను మొదటిసారి కలిశారట మహేష్. ఆ తర్వాత మురుగదాస్ మహేష్ నటించిన ‘అతడు’ సినిమా చూసి అతనితో పనిచేయాలని అనుకోని, మహేష్ ను కలిసినా కూడా ఇద్దరూ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో కలిసి సినిమా చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇకపోతే మురుగదాస్ ‘స్పైడర్’ కథను రాసుకునేప్పుడే మహేష్ హీరో అని నిర్ణయించుకుని ‘శ్రీమంతుడు’ తమిళ ప్రెస్ మీట్ సమయంలో చెన్నైలో ఆయన్ను కలిసి 20 నిముషాల పాటు కథ చెప్పి మెప్పించి లాక్ చేశాడట .

ఆ తర్వాత నెల రోజులకు పూర్తి స్క్రిప్ట్ తో మహేష్ వద్దకు వెళ్లి ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసుకున్నారట. అలా ఆసక్తికరమైన జర్నీతో ట్రాక్ ఎక్కిన ఈ ‘స్పైడర్’ సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

 
Like us on Facebook