ఒక భారతీయ చిత్రానికి ఇప్పటివరకూ లభించని అరుదైన గౌరవం రాజమౌళి చేతిలో బాహుబలి సినిమాకు దక్కనుంది. ఈ చిత్రానికి వాడిన కాస్త్యుమ్స్, ఆయుధాలను ఒక మ్యుజియం రూపంలో ఒక దగ్గరకు చేర్చనున్నారు. సాధారణంగా హాలీవుడ్ చిత్రాలకు ఇటువంటి ఐడియాలు అప్ప్లై చేస్తారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లను హాలీవుడ్ స్టైల్ లో విడుదల చేసిన జక్కన్న ఈ విషయంలోనూ ఇదే ఫార్ములాని ఫాలో అవ్వనున్నాడు.
ఈ చిత్ర ఆడియో ఈవెంట్ ఈ నెల 31న నిశ్చయించినా భద్రతా కారణాల దృష్ట్యా వాయిదా వేసారు. ఈ చిత్ర ట్రైలర్ ని జూన్ 1న విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. జూలై 10న ఈ చిత్రం మనముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి.


