చియాన్ విక్రమ్ “తంగలాన్” మూవీ నుండి బిగ్ అప్డేట్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్!

చియాన్ విక్రమ్ “తంగలాన్” మూవీ నుండి బిగ్ అప్డేట్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్!

Published on Jul 1, 2024 10:32 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ మేకోవర్ కి అందరి నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రం కి సంగీతం అందిస్తున్న జీవీ ప్రకాష్ కుమార్ సినిమా పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తంగలాన్ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి అయ్యింది అని, తన బెస్ట్ ఈ చిత్రంకు అందించినట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక అధ్బుతమైన ట్రైలర్ త్వరలో రాబోతుంది అని అన్నారు. భారతీయ సినిమా తంగలాన్ కోసం సిద్ధం గా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా పై జీవీ ప్రకాష్ కుమార్ కు ఉన్న కాన్ఫిడెంట్ ఓ రేంజ్ లో ఉంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు