సంగీత దర్శకుడిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తమన్ !


ఎస్ ఎస్ తమన్ కెరీర్ లో ఈ రోజు ప్రత్యేకమైన రోజుగా నిలించింది ఈ రోజుతో అయన ఇండస్ర్టీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు .ఈ క్రమంలో దాదాపుగా 80 చిత్రాలకు సంగీతం అందించారు. రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాకి సంగీత దర్శుకుడిగా పరిచియమైన తమన్ అక్కడినుండి వెనుతిరిగి చూసుకోలేదు. యెన్నో చిత్రాలకి అద్భుతమైన సంగీతం అందించారు.

ప్రస్తుతం తెలుగు , తమిళ బాషలలో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు దాదాపుగా తెలుగులో అగ్ర హీరోల సినిమాలకి పనిచేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా చాలా మంది ఇష్టపడుతారు. ఈ ఏడాది బాలీ వుడ్ లో అడుగు పెడుతున్న తమన్ అక్కడ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం .

Exit mobile version