మహేష్ 26కి కూడా దేవీ నే !

Published on Apr 4, 2019 3:07 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత మహేష్ తన 26వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయనున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. కాగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం మహర్షి కి కూడా ఆయనే సంగీతం అందిస్తున్నాడు.

జూన్ మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ చిత్రానికి హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. దిల్ రాజు , అనిల్ సుంకర కలిసి నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :