‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ లో అంటున్న సంగీత దర్శకుడు!

‘టాక్సిక్’ కోసం హాలీవుడ్ లో అంటున్న సంగీత దర్శకుడు!

Published on Jul 14, 2026 12:24 PM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ఇప్పుడు నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”. యష్ డ్యూయల్ షేడ్స్ లో కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార అలాగే హుమా ఖురేషి ఇంకా తారా సుతారియాలు నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు రవి బాసృర్ అందిస్తుండగా పాటలు మాత్రం బాలీవుడ్ స్టార్ కంపోజర్స్ తో చేయిస్తున్నారు. ఇలా అందులో ఒకరైన పాపులర్ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా టాక్సిక్ పై క్రేజీ అప్డేట్ అందించారు. ‘కుకింగ్ ఇన్ హాలీవుడ్’ అంటూ తన సెటప్ నుంచి పిక్ షేర్ చేసి తెలిపారు. అయితే కాలిఫోర్నియా స్టూడియోస్ లో ఈ నెక్స్ట్ సాంగ్ కోసం తాను వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక దీనికి మన టాలీవుడ్ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి నెక్స్ట్ బ్లాస్ట్ సిద్ధం అవుతుంది అని హింట్ ఇచ్చారు. సో ఈ సాంగ్ ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి యష్, కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగష్టు 26న విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు