అసలైన దీపావళి నవంబర్ 7 వ తేదీన – థమన్

Published on Nov 6, 2021 2:23 am IST


పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. అయ్యప్పనుం కొషియం చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో మాస్ గెటప్ తో పోలీస్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి లాలా భీమ్లా పాట కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట నవంబర్ 7 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ తాజాగా మరొక పోస్ట్ చేశారు. ఒక పోస్టర్ ను షేర్ చేస్తూ, అమేజింగ్ డిజైన్ అంటూ చెప్పుకొచ్చారు. అసలైన దీపావళి నవంబర్ 7 వ తేదీన అని, స్పీకర్ల తో సిద్దంగా ఉండండి అంటూ చెప్పుకొచ్చారు. ఊర మాస్ సౌండ్ అంటూ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు నటిస్తున్న ఈ చిత్రం లో నిత్యా మీనన్, సంయుక్త లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :

More