మరో క్రేజీ ఆల్బమ్ గ్యారంటీ అట !

మరో క్రేజీ ఆల్బమ్ గ్యారంటీ అట !

Published on Aug 9, 2020 11:00 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ‘తమన్’.స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్య విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ క్రేజ్ ను అలాగే కొనసాగించేలా ఉన్నాడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. గోపీచంద్ మ‌లినేని – మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ‘క్రాక్’. కాగా క్రాక్ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

కాగా తమన్ సాంగ్స్ తో పాటు షూట్ చేసిన సీన్స్ కు సంబధించిన నేపథ్య సంగీతం మీద వర్క్ మొదలుపెట్టారు.అవుట్ ఫుట్ చాల బాగా వస్తోందట. తమన్ నుండి మరో సూపర్ హిట్ ఆల్బమ్ రావడం గ్యారంటీ అట. ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమాని కరోనా తగ్గాక విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు