నిర్మాతలతో రాజీకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ !

Published on Apr 20, 2019 12:00 am IST

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన మ‌జిలీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ సంగీతం అందించాడు. అయితే విడుదలకు ముందు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాల్సి ఉండగా హఠాత్తుగా సినిమానుండి తప్పుకున్నారు. దాంతో అనుకున్న సమయానికి విడుదలచేయమని భ‌య‌ప‌డ్డ మ‌జిలీ నిర్మాత‌లు వెంటనే త‌మ‌న్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నారు. సినిమా విజయం సాధించడంలో త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా హెల్ప్ చేసింది.

ఇక సినిమా హిట్ అవ్వడం నిర్మాతలకు ఆనందం కలిగించినా గోపీ సుందర్ ను మాత్రం విడిచి పెట్టేలేదని అత‌నిపై చాంబ‌ర్లో కేసు వేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న గోపిసుంద‌ర్‌ నిర్మాత‌ల‌తో రాజీ ప్రయత్నాలు చేసాడట. ఇక ఆ ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యాడట. ఇంతకీ గోపి సుందర్ మజిలీ నిర్మాతలను కేసు వేయకుండా ఎలా ఆపగలిగాడో తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :