స‌మీక్ష: “మ్యూజిక్ షాప్ మూర్తి” – కొన్ని ఎమోష‌న్స్ కోసం మాత్ర‌మే!

స‌మీక్ష: “మ్యూజిక్ షాప్ మూర్తి” – కొన్ని ఎమోష‌న్స్ కోసం మాత్ర‌మే!

Published on Jun 15, 2024 3:04 AM IST
Music Shop Murthy Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 14, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అజ‌య్ ఘోష్, చాందిని చౌద‌రి, ఆమ‌ని, అమిత్ శ‌ర్మ‌, భాను చంద‌ర్ తదిత‌రులు

దర్శకుడు: శివ పాల‌డుగు

నిర్మాతలు : హ‌ర్ష గార‌పాటి, రంగారావు గార‌పాటి

సంగీత దర్శకుడు: ప‌వ‌న్

సినిమాటోగ్రఫీ: శ్రీ‌నివాస్ బెజుగం

ఎడిటింగ్: బి.నాగేశ్వ‌ర రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అజ‌య్ ఘోష్ లీడ్ రోల్ లో న‌టించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఈ సినిమా నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. టీజ‌ర్, ట్రైల‌ర్ల‌తో ఆడియెన్స్ లో మంచి బ‌జ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ:

మూర్తి(అజ‌య్ ఘోష్) ఓ మ్యూజిక్ షాప్ న‌డుపుతూ జీవ‌నం సాగిస్తుంటాడు. అయితే, అత‌డి ఆదాయం ఏమాత్రం స‌రిపోక‌పోవ‌డంతో, ఆ షాపును అమ్మేయాల‌ని అత‌డి భార్య‌(ఆమ‌ని) పోరు పెడుతూ ఉంటుంది. దీంతో మూర్తి డీజే గా మారాల‌ని అనుకుంటాడు. దీని కోసం అంజ‌నా(చాందిని చౌద‌రి) అత‌డికి సాయం చేసేందుకు ఒప్పుకుంటుంది. ఇంత‌కీ అంజ‌నా ఎవ‌రు..? మూర్తికి ఆమె సాయం ఎందుకు చేస్తుంది..? మూర్తి డీజే గా మారుతాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్, విల‌న్ రోల్స్ లో త‌న న‌ట‌న‌తో మెప్పించిన అజయ్ ఘోష్, ఈ సినిమాలో లీడ్ రోల్ లో ఆక‌ట్టుకున్నాడు. మూర్తి పాత్ర‌లో అజ‌య్ ఘోష్ న‌ట‌న చాలా బాగుంది. కొన్ని సీన్స్ లో ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. అటు చాందిని చౌద‌రి కూడా బాగా న‌టించింది. ఓ 50 ఏళ్ల వ్య‌క్తికి సాయం చేసే పాత్ర‌లో చాందిని చౌదరి మెప్పించింది.

ఇక ఈ సినిమాలోని ఫ‌స్ట్ హాఫ్ క‌థ‌ను చ‌క్క‌గా ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. సినిమాలోని కొన్ని డైలాగులు ఆడియెన్స్ ను స‌ర్ ప్రైజ్ చేస్తాయి. చ‌క్క‌టి నేప‌థ్య సంగీతం తో పాటు ఒక‌ట్రెండు పాట‌లు కూడా విన‌సొంపుగా ఉంటాయి.

మైన‌స్ పాయింట్స్:

ఈ సినిమాకు ఫ‌స్ట్ హాఫ్ ఎంత ప్లస్ అయ్యిందో, సెకండ్ హాఫ్ అంత మైన‌స్ గా నిలిచింది. ఓ ద‌శ‌లో సెకండాఫ్ సినిమాపై ఉన్న ఆస‌క్తిని పూర్తిగా త‌గ్గించేస్తుంది. కొన్ని సీన్స్ లోని ఎమోషన్స్ ను బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది.

సినిమాలో ఆకట్టుకునే లైన్ ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు దీన్ని ఓ రొటీన్ మూవీగా మార్చేస్తుంది. దీనికితోడు పేస్.. మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ సినిమా రిజ‌ల్ట్ పై తీవ్ర ప్ర‌భావం చూపెడుతుంది. ఈ సినిమాను మ‌రింత ప‌వ‌ర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి ఉంటే, ప్రేక్ష‌కుల‌కు ఓ చ‌క్క‌టి ఎక్స్ పీరియ‌న్స్ క‌లిగేది.

సాంకేతిక విభాగం:

శివ పాల‌డుగు తొలి ప్ర‌యత్నంలో ద‌ర్శ‌కుడిగా ఓకే అనిపించినా, రైట‌ర్ గా మాత్రం మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. కొన్ని డైలాగులు అత‌డికి మంచి పేరును తీసుకొస్తాయి. నాగేశ్వ‌ర రెడ్డి ఎడిటింగ్ వ‌ర్క్ ఆక‌ట్టుకునే విధంగా లేదు. సినిమాలోని చాలా సీన్స్ లో ఆయ‌న ప‌నిత‌నం మిస్ ఫైర్ అయ్యింది. ప‌వ‌న్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా బాగుండి ఉంటే, సినిమాపై సంగీతం ప్రభావం ఉండేది. శ్రీ‌నివాస్ బెజుగం సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. చిత్ర నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో మంచి లైన్ ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఈ మూవీని ఓ యావ‌రేజ్ సినిమాగా నిలిపింది. అజ‌య్ ఘోష్ న‌ట‌న‌తో మెప్పించే ప్ర‌య‌త్నం చేసినా.. స్లో స్క్రీన్ ప్లే, సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ ఈ సినిమాపై ఆస‌క్తిని త‌గ్గించాయి. మూవీ ల‌వ‌ర్స్ ఈ సినిమాను ఒక‌సారి చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు