ఆ స్టార్ కమెడియన్ సినిమా 20 రోజుల్లోనే !

ఆ స్టార్ కమెడియన్ సినిమా 20 రోజుల్లోనే !

Published on Jul 10, 2018 6:34 PM IST

My Dear Marthandam1
కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఇప్పటికే ఆయన అనేక సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు. ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తం నవ్వించడానికి రెడీ అయిపోయారు. నూతన దర్శకుడు హరీష్. కెవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అతి తక్కువ కాలంలోనే కేవలం 20 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా పూర్తి చేసుకుంది.

కాగా పృథ్వి ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. క్రైమ్ కామెడీ జానర్లో ఈ చిత్రం రూపొందింది. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు విడుదలకానున్నాయి. ఈ సినిమాలో కల్పిక హీరోయిన్ గా నటిస్తోంది. జయప్రకాష్ రెడ్డి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, సుదర్శన్ వంటి స్టార్ కమెడియన్లు కూడా ఈ సినిమాలో నటించారు.

తాజా వార్తలు