ఇంటర్వ్యూ: కళ్యాణ్ రామ్ – ‘నా నువ్వే’ సినిమాతో నా కల నెరవేరింది

ఇంటర్వ్యూ: కళ్యాణ్ రామ్ – ‘నా నువ్వే’ సినిమాతో నా కల నెరవేరింది

Published on Jun 13, 2018 3:40 PM IST

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా క్లాస్ హీరోగా లుక్ మార్చుకుని చేసిన చిత్రం ‘నా నువ్వే’. జయేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు 14 విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

మొదటిసారి పూర్తి లవ్ స్టోరీ చేస్తున్నారు. ఎలా ఉంది ?
చాలా బాగుంది. నాక్కుడా కొత్తగా అనిపించింది. పిసి.శ్రీరామ్ గారి లాంటో గొప్ప వ్యక్తులతో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టం. ‘గీతాంజలి’ సినిమా చూసి ఈయన లాంటి వారితో వర్క్ చేయగలమా అనుకునే వాడిని. ఇప్పటికి నా కల నెరవేరింది.

మీ దర్శకుడు జయేంద్రగారి గురించి చెప్పండి ?
జయేంద్రగారిది పూర్తిగా భిన్నమైన పద్దతి. ఆయనకొక విజన్ ఉంది. ఒక రొమాంటిక్ సినిమాలో ఎలా నటించాలో నాకు ముందుగానే టిప్స్ ఇచ్చేవారు. సెటిల్ యాక్టింగ్ చేయాలి, డైలాగ్స్ తక్కువ హావభావాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడా కొంచెం కూడ తేడా రానిచ్చేవారు కాదు. చాలా బాగా చేశారు.

ఒక్కసారిగా రొమాంటిక్ హీరోగా మారిపోవడం ఎలా ఉంది ?
రొమాంటిక్ హీరో, మాస్ హీరో అంటూ ఏం ఉండదు. నిజానికి ఆ ట్యాగ్స్ అంటే నాకు భయం. ఎప్పుడు ఏ మంచి సినిమా వస్తే ఆ సినిమా చేసుకుంటూ పోవాలి. అది మాస్ సినిమా అయినా సరే రొమాంటిక్ సినిమా అయినా సరే.

ఈ సినిమాకుగాను మీకు అందిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ?
మా అబ్బాయి సినిమాలో నన్ను చూసి నాన్న అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అన్నాడు. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
ఇందులో నేను పి.హెచ్.డి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే అబ్బాయిలా కనిపిస్తాను. కొంచెం ఇగో ఉన్న పాత్ర. ఆ పాత్రలో ఇంకో షేడ్ కూడ ఉంటుంది. దాన్ని సినిమాలోనే చూడాలి.

మీ కోస్టార్ తమన్నాతో వర్క్ ఎలా ఉంది ?
తమన్నా చాలా ప్రొఫెషనల్. సమయానికి సెట్ కి వచ్చేస్తుంది. చాలా డెడికేషన్ తో వర్క్ చేస్తుంది. ఆమెతో పనిచేయడం బాగుంది.

మాస్ హీరోగా చేయడం కష్టంగా ఉందా రొమాంటిక్ హీరోగానా ?
అంటే రెండూ వేరు వేరు జానర్ సినిమాలు. మాస్ సినిమాల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ సినిమాల్లో మానసిక శ్రమ ఉంటుంది. లవ్ స్టోరీల్లో హీరో హీరోయిన్ల మధ్యన సయోధ్య కుదిరితే రొమాన్స్ చాలా సులభంగా పండుతుంది.

మీ నిర్మాతల గురించి చెప్పండి ?
కిరణ్, విజయ్ లు మంచి నిర్మాతలు. అలాగే మరొక నిర్మాత మహేష్ కోనేరు కూడ. అతని వలనే ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది.

ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు నిర్మిస్తారు ?
ప్లాన్స్ ఉన్నాయి. ఎక్కువ భాగం 2019లోనే ఉండే అవకాశాలున్నాయి.

గుహన్ గారితో చేస్తున్న సినిమా ఎంతవరకు వచ్చింది ?
ఈ నెల 18 కి దాదాపు 50 శాతం సినిమా పూర్తవుతుంది. జూలై చివరికి పూర్తయ్యే అవకాశాలున్నాయి .

ఇంకా కొత్త సినిమాలేవైనా చేస్తున్నారా ?
విరించి వర్మతో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఫైనల్ హియరింగ్ త్వరలోనే ఉంటుంది. అది కూడ డిఫరెంట్ జానర్ సినిమా. దానికోసం కొత్త గెటప్ ట్రై చేయాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు