నా కుటుంబం నాకు ఎంతో సపోర్ట్ చేసింది – ప్రభాస్

నా కుటుంబం నాకు ఎంతో సపోర్ట్ చేసింది – ప్రభాస్

Published on Jun 6, 2015 1:24 PM IST

prabhas

‘బాహుబలి’ విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర టీం మొత్తం ప్రమోషన్ తో చాలా బిజీ గా వుంది. నిన్న విడుదలైన తమిళ్ ట్రైలర్ కి స్పందన అనూహ్యంగా వస్తుంది.

నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన ప్రభాస్ చిత్ర షూటింగ్ సమయం లో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయం లో తన కుటుంబం తనకు సపోర్ట్ గా నిలపడడం వల్లే అన్ని అడ్డంకులని దాటగలిగానని తెలిపారు.

గత మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ‘బాహుబలి’ టీం కల నెరవేరనుంది. జీనియస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో అనుష్క రాణా దగ్గుబాటి మరియు తమన్నా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు