తెలుగు సినిమాల్లో నటించడం నా అదృష్టం – సోనూసూద్

Published on May 21, 2019 2:00 am IST

తేజ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న సినిమా ‘సీత’. మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ఈ చిత్రం. కాగా ఈ రోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

కాగా ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాల్లో నటించడం నా అదృష్టం. ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు. నేనెక్కడ నటించిన తెలుగు ఇండస్ట్రీ ని మర్చిపోను.. మళ్ళీ మళ్ళీ తెలుగులో నటించాలని ఉంది.. ఈ సినిమా లో నన్ను తీసుకున్నందుకు తేజ గారికి చాల థాంక్స్. నా కెరీర్ లో ఈ పాత్ర నిలిచిపోతుంది అని అన్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More