టాలీవుడ్ ఆరడుగుల ఆజానుబాహుల్లో యంగ్ హంక్ రానా కూడా ఒకరు.. రానా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తున్నాడు. తన ఫిజిక్ వల్లే బాహుబలి లాంటి సినిమాలో అవకాశం వచ్చింది. ‘నా ఫిజిక్ మరియు కండలు తిరిగిన బాడీ వల్లే నాకు బాహుబలి లాంటి సినిమాలో పనిచేసే అవకాశం దక్కిందని’ రానా తెలిపాడు. ఈ విషయాన్ని రానా బేబీ ప్రమోషనల్ ఈవెంట్ లో చెప్పాడు.
అలాగే బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ‘ఇప్పటికే బాహుబలి ఫస్ట్ పార్ట్ కి షూటింగ్ ఫినిష్ చేసాను. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి షూటింగ్ చేస్తున్నాను.. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి 60% షూట్ పూర్తయ్యింది. ఈ టఫ్ ప్రాజెక్ట్ కి 120కి పైగా కాల్షీట్స్ ఇచ్చానని’ తెలిపాడు. రానా నీరజ్ పాండే దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ బేబీలో నటించాడు. ఈ సినిమా జనవరి 23న రిలీజ్ కానుంది.


