అఖిల్ 3 సెట్ కు అనుకోని అతిధి !
Published on Sep 11, 2018 2:30 pm IST

అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. తొలిప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇక ఈ సినిమా సెట్ కు అనుకోని అతిధి వచ్చారు. ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ మైరా దండేకర్. ఈసందర్భంగా అఖిల్ , మైరాతో దిగిన ఫొటో ను తన ఇంస్టా గ్రామ్ లో షేర్ చేశారు. మైరా, అఖిల్ నటించిన రెండవ చిత్రం ‘హలో’ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో జున్ను గా నటించింది.

ఇక శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకం ఫై బి విఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈచిత్రానికి ‘మిస్టర్ మజ్ను’అనే టైటిల్ ప్రచారంలో వుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది.

  • 33
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook