మహేష్ నెక్స్ట్ పై కొనసాగుతున్న మిస్టరీ.!

Published on Mar 24, 2021 7:05 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే హ్యాట్రిక్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇటీవలే షూట్ ను ప్రారంభించుకున్న ఈ చిత్రం విషయం పక్కన పెడితే మహేష్ చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై మాత్రం ఇంకా మిస్టరీ అలా కొనసాగుతూనే ఉంది.

రాజమౌళితో చేసే సినిమా కంటే ముందే ఒకటి కన్ఫర్మ్ కానీ అది ఎవరితో అన్నదే అసలు ప్రశ్న. ఇప్పటికే మహేష్ లిస్ట్ లో త్రివిక్రమ్ మరియు అనీల్ రావిపూడిలు కన్ఫర్మ్ అయ్యారు. మరి లేటెస్ట్ గా మహర్షి నేషనల్ అవార్డు విన్నింగ్ తో వంశీ పేరు మళ్ళీ హాట్ టాపిక్ అవుతుంది. దీనితో ఈ ముగ్గురిలో మహేష్ నెక్స్ట్ ఎవరు చేస్తారు అన్నది ఇప్పుడప్పుడే సమాధానం దొరికే ప్రశ్నలా లేదు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం :