విజయ్ దేవరకొండ హీరో చిత్ర టైటిల్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు అదే టైటిల్ తో తమిళ హీరో ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశాడు. వివరాలలోకి వెళితే విజయ్ దేవరకొండ కొత్త దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే టైటిల్ తో ఒక మూవీ ఓ.కే చేశారు. ఈ చిత్రంలో మాళవిక మోహన్ విజయ్ సరసన నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. విజయ్ ప్రొఫెషనల్ బైక్ రేసర్ గా కనిపించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకెళ్లనుంది.
ఐతే తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న కొత్త చిత్ర టైటిల్ కూడా హీరోగా పెట్టడంతో పాటు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టడం జరిగింది. దీనితో మైత్రి మూవీ మేకర్స్ 2017లో ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకోవడంతో పాటు రెన్యూవల్ కూడా చేయిస్తున్న తరుణంలో శివ కార్యికేయ మూవీ కి హీరో టైటిల్ ఎలా పెడతారంటూ కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నందు పిర్యాదు చేయడం జరిగింది. మరి వీరి పిర్యాదు పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


