అత్యుత్సాహులకు చెక్ చెప్పిన మైత్రి మూవీ మేకర్స్.!

Published on Mar 24, 2021 8:00 am IST

సోషల్ మీడియా అంటే ఎలా ఉంటుందో ప్రస్తుత రోజుల్లో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరికీ నచ్చినట్టు వారు తమ భావాలను అందులో వ్యక్తం చేస్తారు. అయితే అవి ఎంత వరకు నిజమో అబద్దమో మంచో చెడో క్షణికావేశంలో నడుస్తుంటాయి. ముఖ్యంగా సినిమా హ్యాండిల్స్ వారికి గట్టిగానే అభిమానుల నుంచి అభ్యంతరకర కామెంట్స్ నెటిజన్స్ నుంచి వస్తుంటాయి. మరి అలాంటి వారికే మన తెలుగులో భారీ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ చెక్ చెప్పింది.

తమ హ్యాండిల్ లో కానీ ఎవరైనా నెటిజన్స్ అభ్యంతరకర కామెంట్స్ కానీ పోస్ట్ లు కానీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బ్లాక్ చేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. క్లీన్ సోషల్ మీడియా ఉండేలా చూసుకుందామని సూచించారు. వీరు ఎలాగో తమ సినిమాలకు సంబంధించి అప్ టు డేట్ అప్డేట్స్ ఇస్తారు కాబట్టి పర్లేదు కానీ మిగతా హ్యాండిల్స్ కూడా కొన్నిటికి అంతకంటే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉన్నాయి మరి వారు కూడా ఇలాంటి స్టెప్ తీసుకుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :