‘మోగ్లీ’ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసేది వీరే..!

Mowgli 1

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తుండగా యంగ్ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది.

కాగా ఈ సినిమాను డిసెంబర్ 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో ప్రముఖ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు మరింత బూస్ట్ లభించిందని చెప్పాలి. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ను వేగవంతంగా తీసుకెళ్తున్నారు మేకర్స్.

ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తుండగా హర్ష చెముడు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version