తెలంగాణాలో పన్ను రాయితీ పొందిన ‘నా బంగారు తల్లి’

తెలంగాణాలో పన్ను రాయితీ పొందిన ‘నా బంగారు తల్లి’

Published on Dec 6, 2014 1:25 PM IST

na-bangaru-talli
విడుదలకు ముందు ఎన్నో వ్యయ ప్రయాసలు పడిన జాతీయ అవార్డు సినిమా ‘నా బంగారు తల్లి’ ఎట్టకేలకు ఈ నవంబర్ 21న విడుదలైంది. సామాజిక స్పృహతో తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా నిర్మాతలకు తమవంతు సహాయంగా తెలంగాణా ప్రభుత్వం పన్ను రాయితీని కల్పించింది

‘నా బంగారు తల్లి’ సినిమా స్త్రీలు వ్యభిచార గృహాలకు ఏ కారణాల మీద వెళ్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నారు అన్న సున్నితమైన అంశాలపై తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించిన అంజలి పాటిల్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నేపధ్య సంగీతం విభాగాలలో సైతం ఈ సినిమా అవార్డులను అందుకుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు