‘హలో మీరా’ నుంచి ‘నా కనులలో నా కలలో’ సాంగ్ రిలీజ్

‘హలో మీరా’ నుంచి ‘నా కనులలో నా కలలో’ సాంగ్ రిలీజ్

Published on Mar 21, 2023 9:21 AM IST

గత కొన్నాళ్లుగా మంచి కాన్సెప్ట్ తో ఆకట్టుకునే రీతిన సాగే కథా సినిమాలకు ఆడియన్స్ నుండి బాగా ఆదరణ లభిస్తోంది. మరోవైపు ఎక్కువగా ప్రయోగాత్మక కథల సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే అదే బాటలో తాజాగా హలో మీరా అంటూ ఓ వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన కాకర్ల శ్రీనివాసు ఈ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్నారు.

లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో ఈ ప్రయోగాత్మక సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో మీరా గా గార్గేయి యల్లాప్రగడ నటించారు. దీనికి సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. సింగిల్ క్యారెక్టర్‌తో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఆ విధంగా సినిమాను తీయడం నిజంగా కత్తి మీద సాము. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను ఎలా నడిపించారు అనే ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకులకు కలిగించారు.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి నా కనులలో నా కలలలో అంటూ సాగే ఎమోషనల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ సాయి కిరణ్ సాహిత్యం, సమీర భరద్వాజ్ గాత్రం, ఎస్ చిన్నా బాణీ ఈ పాటను ఎంతో వినసొంపుగా మార్చేశాయి. డా లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా దీనికి ఎస్ చిన్న సంగీతం అందించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్ గా, కత్రి మల్లేష్ , ఎం రాంబాబు ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు.

హిరణ్మయి కల్యాణ్ మాటలు, రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు. మరి అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన హలో మీరా రిలీజ్ తర్వాత ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు