సైనిక కుటుంబాల సమక్షంలో ‘నా పేరు సూర్య’ ఆడియో ఈవెంట్ !

17th, April 2018 - 01:38:26 AM


అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ సినిమా ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ వేడుక ఎక్కడ అనుకుంటున్నారా.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలిట్రీ మాధవరంలో జరగనుంది. ఈ గ్రామానికి ఒక ప్రత్యేక ఉంది. అదేమిటంటే ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం నుండి కనీసం ఒక్కరైన సైన్యంలో ఉంటారు.

అందుకే ఈ గ్రామానికి మిలిట్రీ మాధవరం అనే పేరొచ్చింది. ఈ గ్రామం గురించి తెలుసుకున్న బన్నీ అండ్ టీమ్ సినిమా కూడ సైన్యం నైపథ్యంలో సాగేదే కావడం మూలాన సైనికుల గౌరవార్థం ఆడియో వేడుకను ఈ నెల 22న అక్కడే సైనిక కుటుంబాల సమక్షంలో జరపాలని నిశ్చయించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానున్నారు.

వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా కనిపించనుంది. అలాగే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరవుతారని వార్తలు వినిపించినా ఇంకా ఆ విషయంపై క్లారిటీ రాలేదు.