అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం నిన్న ప్రపంబుచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. బన్నీ సోల్జర్ పాత్రలో నటించిన ఈ సినిమా ఆరంభం నుండి మంచి అంచనాల్ని క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్ వలనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.
మొదటి రోజు చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా ఈరోజు, రేపు వీకెండ్ కావడం, అన్ని పరీక్షలు పూర్తై వేసవి సెలవులు నడుస్తుండంతో చిత్రం కొంత ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మరి డైరెక్ట్ చేసిన ఈ మొదటి చిత్రాన్ని బన్నీ వాస్, శిరీషా శ్రీధర్ లగడపాటి సంయుక్తంగా నిర్మించారు.
