వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇటీవల విడుదలైన ఈచిత్రం అనుకున్నంత స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రం ‘ఎంతే పేరు సూర్య ఎంతే నాడు ఇండియా’ పేరుతో మలయాళ భాషలో విడుదలై 40 రోజులకు గాను రూ. 6.05 కోట్ల గ్రాస్ ను రాబట్టి మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బన్నీ కెరిర్ లో కేరళ బాక్సాఫిస్ వద్ద అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రం గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక బన్నీ కి తెలుగు తో పాటు కేరళ లో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు.


