మరింత స్ట్రాంగ్ గా నిలుస్తున్న “నాంది”.!

Published on Feb 23, 2021 9:14 pm IST


చాలా కాలం నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కు హిట్ తో పాటుగా తనలోని నటుడిని కూడా పూర్తి స్థాయిలో చూపించిన చిత్రం “నాంది”. అంతే కాకుండా స్ట్రాంగ్ కంటెంట్ తో తన అదిరిపోయే కం బ్యాక్ ను నరేష్ ఇప్పుడు అందుకొని ఎమోషనల్ హిట్ కొట్టాడు. అయితే ఈ చిత్రం మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం అక్కడ నుంచి ఒక్కో రోజు మరింత బలపడుతూ వచ్చింది.

అంతే కాకుండా మినిమమ్ రోజుకు కోటి రూపాయల షేర్ ను రాబడుతూ ఈ చిత్రం స్ట్రాంగ్ గా నిలిచింది. అంతే కాకుండా నిన్న వీక్ డే లో కూడా ఈ చిత్రం డీసెంట్ రన్ తో నిలిచినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ ను కూడా ఈ చిత్రం దాటినట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం నరేష్ మరియు దర్శకుడు విజయ్ కనకమేడల కాంబోలో వచ్చిన ఈ చిత్రం వీరి విజయాలకు ఒక “నాంది” అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More