‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హీరోయిన్ నభా నటేష్ అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్టే ఉంది. ఆ చిత్రంతో కమర్షియల్ హీరోయిన్ అనే ఇమేజ్ తెచ్చుకున్న ఈ ఇస్మార్ట్ భామ దాన్ని బాగానే క్యాష్ చేసుకుంటోంది. ప్రస్తుతం ధరమ్ తేజ్ యొక్క ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్న ఆమె ఇంకో సినిమాకు కూడా సైన్ చేసిందట.
అదే బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త చిత్రం. ‘రభస, కందిరీగ, హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నభా నటేష్ అయితే అన్ని విధాలుగా సరిపోతుందనుకున్న నిర్మాతలు ఆమెకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించడానికి సిద్దమయ్యారట. ఈ మొత్తం చాలా ఎక్కివని అంటున్నాయి సినీ వర్గాలు. రేపు 29వ తేదీన ఈ చిత్రం లాంఛ్ కానుంది.
