కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ‘నభా’ !

కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న ‘నభా’ !

Published on Jun 11, 2019 1:05 AM IST

గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్, ఇటీవల విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ లిరికల్ వీడియోలో కనిపించిన స్టిల్స్ లో గ్లామర్ డోస్ గట్టిగా అద్దానని సూచనలిచ్చింది. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ లిరికల్ వీడియో ప్రస్తుతం ఇండియా వైడ్ #3 వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. చాలా తక్కువ మంది కథానాయికలు మాత్రమే అందం – అభినయ సామర్ధ్యంతో మెప్పించగలరు. వారిలో నభా పేరు ముందు వరుసలో నిలుస్తుంది.

ప్రస్తుతం రవితేజతో డిస్కో రాజా, రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో బిజీగా ఉన్న నభాకు టాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజతో కలిసి ఆమె నటించబోయే కామెడీ సీన్స్ కోసం నభా వెయిట్ చేస్తోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమె చాలా క్రేజీ రోల్ ప్లే చేస్తుందట. ఇప్పటివరకూ ఈ తరహా పాత్రను తెలుగు ప్రేక్షకులు చూసి ఉండరు” అని ఇస్మార్ట్ శంకర్ టీమ్ మేట్ తెలిపారు. త్వరలో “ఇస్మార్ట్ శంకర్” ట్రైలర్ విడుదల కానుంది. మరి లిరికల్ వీడియో స్టిల్స్ తోనే కుర్రాళ్ళ మతులు పోగొట్టిన నభా.. ట్రైలర్ లో ఎలా కనిపించబోతొందో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు