అనుకున్న సమయానికే కోలీవుడ్ సంగ్రామం.

అనుకున్న సమయానికే కోలీవుడ్ సంగ్రామం.

Published on Jun 22, 2019 2:29 PM IST

వాడివేడిగా జరుగుతున్న తమిళ సినీ పరిశ్రమకు సంబందించిన నడిగర్ సంఘం ఎన్నికలను తమిళనాడు రిజిస్టర్ అఫ్ సొసైటీ తాత్కాలికంగా వాయిదా వేయడంతో ఒక్కసారిగా కలకం రేగింది. పరిశ్రమకు సంబంధించిన 61మంది వ్యక్తుల సభ్యతం రద్దుకు సంబందించిన కేసు కోర్ట్ విచారణలో ఉన్న నేపథ్యంలో కోర్ట్ తీర్పు వెలువడే వరకు ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని నిర్ణయించారు. ఐతే తమిళనాడు హై కోర్ట్ తీర్పుతో ఈనెల 23న జరగనున్న ఎన్నికలకు అడ్డంకి తొలగింది. ఎన్నికలు యదాతధంగా జరపాలని, ఓట్ల లెక్కింపు మాత్రం 61మంది సభ్యత్వానికి సబందించి కోర్ట్ తీర్పు వెలువడిన తరువాత జరపాలని హై కోర్ట్ జస్టిస్ ఆదికేశవులు తీర్పునిచ్చారు.

దీనితో విశాల్ గ్రూప్ కి భాగ్యరాజ్ గ్రూప్ కి మధ్య యధాతధంగా రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తీర్పుపై విశాల్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఎన్నికల సంధర్బంగా భారతి రాజా విశాల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు