మొన్న ప్రభాస్ కి అమ్మ, నిన్న పవన్ కి అత్త, నేడు మహేష్ కి అక్క

మొన్న ప్రభాస్ కి అమ్మ, నిన్న పవన్ కి అత్త, నేడు మహేష్ కి అక్క

Published on Sep 27, 2014 10:15 AM IST

mahesh-nadiya
మిర్చి సినిమాలో ప్రభాస్ కి అమ్మగా నిన్నటి తరం నటి అయిన నదియాని మరోసారి తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు మన మాస్ డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు సిద్ధపడుతున్నాడు అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది

అయితే ఈ సినిమాలో నదియాని మహేష్ బాబుకు అక్కగా చూపించనున్నారు మన కొరటాల శివ. కధ నచ్చడంతో నదియా కూడా రోల్ ని యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ప్రభాస్ తో మిర్చి సినిమాలలో తన మార్కు నటన చూపించిన నదియా ఈ సినిమాలో సైతం అలరిస్తుందని అంచనా. అధికారిక వివరాలు త్వరలో వెలువడనున్నాయి

తాజా వార్తలు