కింగ్ నాగార్జున మరియు సహజ నటుడు నాని నటిస్తున్న మల్టీ స్టాటర్ చిత్రం ‘దేవదాస్’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘భలేమంచి రోజు’ ఫెమ్ శ్రీ రామ్ ఆధిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తే మళ్లీ నాని తో కలిసి దీనికి సీక్వెల్ కూడా చేస్తారట. ఈవిషయాన్ని నాగార్జున నే స్వయంగా ప్రకటించాడు. ‘చి ల సౌ’ ప్రెస్ మీట్ లో భాగంగా నాగ్ ఈ వాఖ్యలు చేశారు. అలాగే ‘సోగ్గాడే చిన్నినాయన’ కు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రస్తుతం దానికి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపారు.
ఇక ప్రస్తుతం తెలుగులో ‘దేవదాస్’ చిత్రం తో పాటు బాలీవుడ్ లో ‘బ్రహ్మస్త్ర’ అనే చిత్రంలో నటిస్తున్న నాగ్ త్వరలోనే కోలీవుడ్ లో నటించనున్నారు. ఆ వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని నాగ్ ఈ సంధర్బంగా వివరించారు.


