“మహా భారతం” కథను డైరెక్ట్ చేయడానికి రాజమౌళి సర్ పర్ఫెక్ట్ ఛాయిస్ – నాగ్ అశ్విన్

“మహా భారతం” కథను డైరెక్ట్ చేయడానికి రాజమౌళి సర్ పర్ఫెక్ట్ ఛాయిస్ – నాగ్ అశ్విన్

Published on Jul 5, 2024 3:00 AM IST

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898ఎడి చిత్రంతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లను కలగలిపి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. అయితే ఈ చిత్రం పై తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహా భారతం కథ గురించి ప్రస్తావిస్తూ, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఈ కథకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలిపారు. రాజమౌళి చాలా అద్భుతంగా తీస్తారు అంటూ తనదైన శైలిలో తెలిపారు. ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్ లో నటించిన విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ లో పాత్రలు కూడా మరింత ఎక్కువ నిడివి తో ఉండేలా చేయొచ్చు అని తెలిపారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకునే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు