లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘హలో బాసు’ అనే సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలో నటుడు వంశీ భారీ హ్యాంగోవర్‌తో నిద్రలేచి, గొంతు మారడంతో మాట్లాడే బదులు పాడుతూ వింతగా ప్రవర్తిస్తాడు. ఊరిలోని వారందరికీ ఇదే వింత సమస్య ఉందని ఒక చిన్న పిల్లాడు వచ్చి చెప్పడం ఈ పాటలో హైలైట్.
అయితే, ఎంతో ఫన్‌గా సాగే ఈ ప్రత్యేక గీతాన్ని కేవలం ప్రమోషన్స్ కోసమే వాడామని, సినిమాలో ఇది ఉండదని చిత్రబృందం స్పష్టం చేసింది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..సింగీతం గారిపై ఉన్న గౌరవంతోనే ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు. నిజానికి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఆయన ‘పుష్పక విమానం’ కంటే ముందు నుంచే అనుకుంటున్నారని, అప్పట్లో కమల్ హాసన్‌కు కూడా ఈ కథను వినిపించారని, కానీ అప్పుడు అది కుదరలేదని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దీంతో సింగీతం రూపొందిస్తున్న ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో రానుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.


