తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించబోయే భారీ మల్టీస్టారర్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని ఇటీవల కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల మేర రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకోబోతున్నట్లు కోలీవుడ్ టాక్.
ఈ సినిమాను నిర్మిస్తున్న సంస్థల్లో ఒకటైన ‘రెడ్ జెయింట్ మూవీస్’ మాజీ సీఎం స్టాలిన్ కుటుంబానికి చెందినది కావడం.. కమల్ హాసన్ మరో నిర్మాతగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ప్రతిపక్షంలో ఉన్న ఉదయనిధి సంస్థలో సినిమా చేయవద్దని సీఎం విజయ్.. త్రిషకు ముందు జాగ్రత్తగా సూచించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు, గతంలో కమల్ హాసన్‌తో త్రిష చేసిన ‘మన్మథబాణం’, ‘చీకటిరాజ్యం’, ‘థగ్ లైఫ్’ చిత్రాలన్నీ ఫ్లాప్ కావడం కూడా సెంటిమెంట్ పరంగా ఆమె ఈ ప్రాజెక్ట్ వదులుకోవడానికి మరో కారణంగా చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.


