94 ఏళ్ల వయసులో దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ అనే ఆసక్తికరమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు. ఎక్కువ మంది కొత్త నటీనటులతో, లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే ఏకైక స్టార్ టెక్నీషియన్. ఆయన కూడా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.
ఈ సినిమా విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.14 కోట్లు సాధించి, నిర్మాత నాగ్ అశ్విన్‌ను భారీ లాభాల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా అడ్వాన్స్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు.
థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లన్నీ వైజయంతీ మూవీస్‌కు అదనపు లాభాలుగా మారనున్నాయి. ఈ చిత్రంతో నాగ్ అశ్విన్ మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను నిలబెట్టుకున్నారు.


