ఇంటర్వ్యూ: నాగ్ అశ్విన్ – భవిష్యత్తులో ఇలాంటి సినిమా చేయగలనో లేదో అని ఇప్పుడే చేశాను !
Published on May 7, 2018 5:18 pm IST

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై రెండవ సినిమాగా అలంటి సావిత్రిగారి జీవితాన్ని ‘మహానటి’ పేరుతో తెరకెక్కించిన నాగ్ అశ్విన్ చిత్ర విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం..

ప్ర) ‘మహానటి’ సినిమా ఆలోచన ఎప్పటిది ?
జ) ఈ ఆలోచన చాలా రోజుల నుండి ఉండేది. కానీ ఇంత త్వరగా తీస్తానని అనుకోలేదు. కానీ ఆమె గురించి తెలుసుకున్నాక త్వరగా తీయాలనే బలమైన కోరిక కలిగింది.

ప్ర) సినిమాలో సావిత్రిగారి రీల్ లైఫ్, రియల్ లైఫ్ ను ఎలా బ్యాలన్స్ చేశారు ?
జ) ఆమె సినీ జీవితం, నిజ జీవితం రెండూ దాదాపుగా ఒకేలా నడిచాయి. రెండింటినీ అలాగే అల్లుకుంటూ సినిమా చేశాం.

ప్ర) కీర్తి సురేష్ ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ?
జ) ధనుష్, కీర్తి సురేష్ ల ‘తొడరి’ సినిమాలోని ఒక పాట చూశాక, ఆమెలో ఆ ఇన్నోసెన్స్ ఉందని అనిపించింది. అలాగే ఒకేసారి చిన్న వయసులో, పెద్ద వయసులో రెండింటిలోనూ ఒదిగిపోగలరని నమ్మకం కలిగి ఎంచుకున్నాను.

ప్ర) కెరీర్ ఆరంభంలోనే ఇంత ప్రయోగం చేయాలనీ ఎందుకంపించింది ?
జ) తర్వాత చేయలేనేమోనని ఇప్పుడే చేశాను. ఒక్కసారి సెటిలై ఒక మైండ్ సెట్ ఫిక్సయ్యాక హానెస్టీగా సినిమాలు చేయలేకపోవచ్చని నా అభిప్రాయం.

ప్ర) రెండున్నర గంటల్లోనే సినిమాను ముగించడం ఇబ్బందిగా అనిపించిందా ?
జ) తప్పనిసరి పరిస్థితుల వలన అధికంగా చెప్పాలనుకున్న కొన్ని ట్రాక్స్, ఆమె జీవితంలోని ఇంకొందరి పాత్రలను చెప్పలేకపోయాను.

ప్ర) సినిమా కథ ఎలా ఉంటుంది ?
జ) సినిమా కథలో సావిత్రిగారి చిన్నప్పటి నుండి చివరి వరకు జరిగిన అన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి.

ప్ర) ఎన్టీఆర్ పాత్ర కోసం తారక్ ని అనుకున్నారు కదా.. ఆ పాత్రలో ఎవర్ని తీసుకున్నారు ?
జ) ముందుగా తారక్ గారినే అనుకున్నాం. ఆయన్నే సంప్రదించాం. కానీ కుదరలేదు. అందుకే అభిమానులకు సినిమాలో చిన్నపాటి ట్రీట్ ఉండేలా ఒక పని చేశాం. ఆ ట్రీట్ ఏమిటనేది సినిమాలోనే చూడాలి.

ప్ర) ఇంతకీ కీర్తి సురేష్ గారు ఎలా చేశారు ?
జ) చాలా బాగా చేశారు. ఈ సినిమా చూశాక ఆమె మీద గౌరవం ఇంకా పెరుగుతుంది. అంత బాగా చేసింది.

ప్ర) మీ వెనుక అశ్విని దత్ గారు లేకపోతే సినిమాను ఇంతే గొప్పగా తీయగలిగేవారా ?
జ) ఏమో.. చేసుండకపోవచ్చు. అంటే నిర్మించడమేగాక స్వప్న, ప్రియాంకలు ఇచ్చిన క్రియేటివ్ సపోర్ట్ ఇంకెవరి నుండీ వచ్చి ఉండేది కాదు.

ప్ర) ఇంతమంది నటీ నటుల్ని డైరెక్ట్ చేయడం కష్టమనిపించలేదా ?
జ) లేదు. మోహన్ బాబుగారి నటులతో వర్క్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. దుల్కర్, సల్మాన్ లాంటి వాళ్లంతా 9 గంటలకి షూట్ అంటే 8: 50 కి సెట్స్ లో ఉంటారు.

ప్ర) సినిమా మొత్తాన్ని నిజమైన సంఘటనల ఆధారంగానే చేశారా ?
జ) 99 శాతం సినిమాను వాస్తవ సంఘటనలతోనే తీశాను. ప్రతి సన్నివేశానికి వాస్తవానికి మధ్యన లింక్ ఉంటుంది. కొన్ని చోట్ల హాస్యం పండించడానికి ట్రై చేసినా అది కూడ సంఘటనల్లోంచి తీసుకున్నదే అయ్యుంటుంది.

ప్ర) చాలా మంది సీనియర్ సంగీత దర్శకులు ఉండగా మిక్కీనే ఎందుకు తీసుకున్నారు ?
జ) మిక్కీ కూడ చాలా సీనియరే. అతనికి కూడ చాలా సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఈ సినిమాలో అతని సొంత స్టైల్ కనిపిస్తుంది.

ప్ర) ఈ సినిమాలో సావిత్రిగారి చేసిన సినిమాల్లో ఎన్నింటిని టచ్ చేశారు ?
జ) ఆమె నటించితిన్ ముఖ్యమైన సినిమాల్లో ఒక 11 సినిమాలు వరకు టచ్ చేసి ఉంటాం.

ప్ర) అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారా ?
జ) మలయాళంలో ఇంకా డేట్ అనుకోలేదు. తెలుగు, తమిళంలో మాత్రం ఒకేసారి విడుదల చేస్తున్నాం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook