యువ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ ప్రేక్షకులు, సినీ పెద్దల ప్రశంసలు పొందుతోంది. ఇప్పటికే పలువు సినీ పెద్దలు సినిమాను పొగడగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహానటి టీమ్ నాగ్ అశ్విన్, అశ్వినీ దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ లను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఇండస్ట్రీ గర్వపడే సినిమా తీసినందుకు అభినందనలు తెలిపారు.
ఇదలా ఉంచితే ప్రస్తుతం నాగ్ అశ్విన్ చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలు పరిశ్రమలో తెగ హడావుడి చేస్తున్నాయి. అశ్విన్ చిరుని దృష్టిలో పెట్టుకుని ఒక లైన్ అనుకున్నారని, ఆయన అనుమతిస్తే పూర్తి స్క్రిప్ట్ తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తేలాలంటే సంబందిత వ్యక్తుల నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.


