నాగ్ క్రేజీ సీక్వెల్ మొదలు కానుంది !

నాగ్ క్రేజీ సీక్వెల్ మొదలు కానుంది !

Published on Mar 14, 2021 8:52 PM IST

nagarjuna2

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” మంచి విజయాన్ని సాధించడం, పైగా ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించడటంతో మొదటి నుండి ఈ సినిమా పై నాగ్ అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ ఊపులో సోగ్గాడే చిన్ని నాయ‌న ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తామని మేకర్స్ ప్రకటించటం జరిగింది. మధ్యలో కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో “రారండోయ్‌ వేడుక చూద్దాం” సినిమా చేశాడు.

ఆ తరువాత కథ ఓకే చేయించుకుని బంగార్రాజు స్టార్ట్ చేద్దామనుకున్నా బిగ్ బాస్ షో, వేరే సినిమాలు, మరికొన్ని కారణాల వలన ఇంతకాలం లేట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం అహిషోర్ సోలమన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను చేస్తున్నాడు నాగార్జున. ఇది రిలీజ్ కి సిద్ధం అయింది. దాంతో బంగార్రాజు సినిమా ఏప్రిల్ రెండో వారం నుంచి చిత్రీకరణ మొదలు కానుందని ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పార్ట్ లో కూడా నాగార్జున సరసన రమ్యకృష్ణ కొనసాగుతుందని, ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు