అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఫైనల్ కాపీ నాగార్జునతో సహా టీమ్ చూశారని.. సినిమాతో పాటు అఖిల్ నటన కూడా నాగార్జునకి చాలా బాగా నచ్చిందని.. ముఖ్యంగా క్లైమాక్స్ లో అఖిల్ యాక్టింగ్ తన కెరీర్ లోనే హైలైట్ గా నిలుస్తోందని నాగ్ ఫీల్ అయ్యారట. మొత్తానికి ఈ సినిమాలో అఖిల్ నటనకు నాగార్జున ఇంప్రెస్ అయ్యారు. నాగ్ సలహాలకు అనుగుణంగా కొన్ని సీన్స్ ను రీషూట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.


